కేబీఆర్ పార్కు వద్ద నిలిచిన వరద నీటిని హైడ్రా తొలగించింది. కేబీఆర్ పార్కులోంచి భారీ మొత్తంలో వచ్చిన వరద రోడ్డుమీద నిలబడగా.. హైడ్రా, ట్రాఫిక్, జీహెచ్ ఎంసీ సంయుక్తంగా ఆ నీటిని తొలగించి వాహనదారులకు ఇబ్బంది లేకుండా చేశాయి. కేబీఆర్ ప్రధాన గేటు నుంచి జూబ్లీహిల్స్ చెక్ పోస్టు వైపు వెళ్లే మార్గంలో నీరు నిలిచిపోయింది. ఆ నీటిని హైడ్రాకు చెందిన నీటి ఇంజిన్లను పెట్టి బయటకు తోడేశారు. నగర ఇన్‌ఛార్జి మంత్రి శ్రీ పొన్నం ప్రభాకర్‌గారు, మేయర్ శ్రీమతి గద్వాల్ విజయలక్ష్మి గారు ఈ పనులను పర్యవేక్షించారు. కేబీఆర్ పార్కు రోడ్డును దాటి వెళ్లేందుకు ఉద్దేశించిన పైపు లైన్లు విస్తరించాల్సి ఉందని.. రోడ్డుకు ఒకవైపే వెంట్ ఉండడం మరోవైపు రోడ్డు మీద నుంచే నీరు పోవాల్సిన పరిస్థితి ఉంది. వెంటనే ఈ సమస్యను కౌన్సిల్‌లో పెట్టి పైపులైన్లు ఏర్పాటు పనులను మంజూరు చేయిస్తామని మంత్రితో పాటు మేయర్ ఈ సందర్భంగా అధికారులకు చెప్పారు. అప్పటివరకూ ఇక్కడ నీరు నిలవకుండా జాగ్రత్తలు తీసుకోవాలని హైడ్రా, జీహెచ్ ఎంసీ, ట్రాఫిక్ అధికారులకు సూచించారు. హైడ్రా ఏడీఎఫ్‌వో మోహన్ రావు, GHMC ఈ ఈ విజయ్ కుమార్, ట్రాఫిక్ DCP రాహుల్ తో పాటు పలువురు అధికారులు ఈ పనులను పూర్తి చేయించిన వారిలో ఉన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa