ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సీఎస్ రామకృష్ణరావు కార్యాలయంలో ప్రత్యక్షమైన అరుదైన చిలుక

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Aug 21, 2025, 06:06 AM

తెలంగాణ రాష్ట్ర సచివాలయానికి అనుకోని 'అరుదైన' అతిథి విచ్చేశారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణరావు కార్యాలయంలో అరుదైన జాతికి చెందిన చిలుక ఒకటి ప్రత్యక్షమైంది. ఆయన ఛాంబర్‌‍లోకి ఒక్కసారిగా ప్రవేశించిన ఆ చిలుక నేరుగా ఒక డెస్క్‌పై వాలింది.ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కార్యాలయానికి వచ్చిన ఆ అరుదైన చిలుకకు సిబ్బంది కొంతసేపు విశ్రాంతినిచ్చారు. అనంతరం అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. వెంటనే స్పందించిన అటవీ శాఖ సిబ్బంది సచివాలయానికి చేరుకుని, అది ఆఫ్రికన్ గ్రే చిలుక అని నిర్ధారించారు. ఆ పక్షిని వారు తమ వెంట తీసుకువెళ్లారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa