నాగర్ కర్నూల్ జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, కల్వకుర్తి నియోజకవర్గం తెలకపల్లిలో ఆదివారం ఎస్ఐ నరేష్ ఆధ్వర్యంలో వినాయకచవితి సన్నాహక సమావేశం జరిగింది. గణేష్ మండపాలు ఏర్పాటు చేసేవారు https://policeportal.tspolice.gov.in/index.htm పోర్టల్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తు సమయంలో కమిటీ వివరాలు, మండపం వివరాలు, ఏర్పాటు చేసే ప్రదేశం, ఫోన్ నంబర్లు తప్పనిసరిగా ఇవ్వాలని అధికారులు తెలిపారు. ప్రజలకు ముందస్తు జాగ్రత్తలు కూడా సూచించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa