తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రైతుల కన్నీళ్లు తుడిచేందుకే కాళేశ్వరం ప్రాజెక్ట్ చేపట్టారని పీర్జాదిగూడ మాజీ మేయర్ జక్క వెంకట్ రెడ్డి అన్నారు. కాళేశ్వరంపై కాంగ్రెస్ చేస్తున్న కుట్రలకు నిరసనగా, పీర్జాదిగూడ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం నిరసన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ జక్క వెంకట్ రెడ్డి, మాజీ కార్పొరేటర్లు దొంతిరి హరిశంకర్ రెడ్డి, నాయకులు నల్ల బ్యాడ్జ్ లు ధరించి రాస్తా రోకో చేపట్టారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa