TG: రాష్ట్రంలో మంగళ, బుధవారం అక్కడక్కడా మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రుతుపవనాల నిష్క్రమణ వేళ ఈ వర్షాలు సంభవిస్తున్నాయని పేర్కొంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని నల్గొండ, చిట్యాల, శాలిగౌరారం, మునుగోడు, త్రిపురారం, నిడమనూరు ప్రాంతాల్లో వర్షం కురిసింది. దీంతో మోత్కూర్, చౌటుప్పల్ మార్కెట్ యార్డులలో ధాన్యం తడిసి ముద్దయి, రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa