నల్లగొండ జిల్లాలోని నాగార్జున ప్రభుత్వ కళాశాలలో గురువారం పర్యావరణహిత వస్తువుల ప్రదర్శన, విక్రయం జరిగింది. మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్, నేషనల్ గ్రీన్ కోర్, కళాశాల ఎకో క్లబ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. కళాశాల విద్యార్థులు, పట్టణంలోని సెల్ఫ్ హెల్ప్ గ్రూపు సభ్యులు స్టాల్స్ ఏర్పాటు చేసి పర్యావరణహిత వస్తువులను ప్రదర్శించి, విక్రయించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa