వచ్చే నెల నవంబర్ 1వ తేదీన బీఎస్పీ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన 42% రిజర్వేషన్ల విషయమై బీసీలకు న్యాయం చేయాలని ఇందిరా పార్క్ వద్ద మహా ధర్నా నిర్వహించబడుతుంది. రాష్ట్ర అధ్యక్షులు ఇబ్రాము శేఖర్ అధ్యక్షతన జరిగే ఈ కార్యక్రమంలో బీఎస్పీ రాష్ట్ర, జిల్లా, మండల నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ మేరకు సిద్దిపేట జిల్లాలో గోడపత్రిక విడుదల చేశారు. కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా అధ్యక్షులు ఉమేష్, నాయకులు పచ్చిమట్ల రవీందర్ గౌడ్, వెలుపుల రాజు తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa