పటాన్చెరు : భారతదేశ మొదటి ఉప ప్రధాని, ఉక్కుమనిషి శ్రీ సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా రాష్ట్రీయ ఏక్తా దివాస్ లో భాగంగా పటాన్చెరు డివిజన్ పరిధిలోని మైత్రి మైదానంలో ఏర్పాటుచేసిన 2 కి.మీ. రన్ ను శుక్రవారం ఉదయం పటాన్చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి గారు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశ ఐక్యతకు ఉక్కుమనిషిగా పేరొందిన సర్దార్ వల్లభాయ్ పటేల్ జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శప్రాయమని అన్నారు. స్వాతంత్ర్యానంతరం అనేక దేశీయ సంస్థానాలను భారతదేశంలో విలీనం చేయడంలో కీలక పాత్ర పోషించిన మహోన్నత వ్యక్తి పటేల్ అని కొనియాడారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa