సిద్దిపేట జిల్లా అక్కన్నపేటలో వాగులో కొట్టుకుపోయిన కల్పన, ప్రణయ్‌ల మృతదేహాలు రెండు రోజుల నిరీక్షణ అనంతరం లభ్యమయ్యాయి. బుధవారం రాత్రి భీమదేవరపల్లి నుండి అక్కన్నపేటకు వెళుతున్న క్రమంలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. మల్లంపల్లి చెరువుకు పెద్ద తండా సమీపంలో ఒడ్డుకు మృతదేహాలు కొట్టుకు వచ్చినట్లు సమాచారం. యువ దంపతుల మృతదేహాలు దొరకడంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. కల్పన పుట్టినరోజు ఆమె డెత్ డేగా మారడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa