ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మూడు ఇసుక ట్రాక్టర్లు పట్టివేత

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sun, Nov 02, 2025, 12:22 PM

శనివారం సాయంత్రం నల్లగొండ మండలం డిండి వాగు నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తున్న మూడు ట్రాక్టర్లను, నల్లగొండ జిల్లా కేంద్రంలోని శివారులోని ప్రతాప్ నగర్ లో పోలీసులు పట్టుకున్నారు. ట్రాక్టర్లను పోలీస్ స్టేషన్ కు తరలించి ముగ్గురు డ్రైవర్లపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై బాలకృష్ణ తెలిపారు. అక్రమంగా ఇసుక రవాణా చేస్తే చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa