ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భార్యపై అనుమానం: కుటుంబంలో ముగ్గురి హత్య, ఆపై ఆత్మహత్య

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Nov 03, 2025, 03:21 PM

వికారాబాద్ జిల్లా కుల్కచర్లలో భార్యపై అనుమానంతో యాదయ్య అనే వ్యక్తి తన భార్య, చిన్న కూతురు, వదిన హనుమమ్మలను కొడవలితో గొంతు కోసి హత్య చేశాడు. పెద్ద కుమార్తె అపర్ణపై కూడా దాడి చేయగా, ఆమె గాయాలతో బయటపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. అనంతరం యాదయ్య ఇంట్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టగా, భార్యపై అనుమానమే ఈ ఘోరానికి కారణమని ప్రాథమికంగా గుర్తించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa