అదిలాబాద్ జిల్లాలో విమానాశ్రయం అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం పెద్ద ముందడుగు వేసింది. జిల్లాలో జాయింట్ యూజర్ ఎయిర్‌ఫీల్డ్ (Joint User Airfield) ఏర్పాటుకు సంబంధించి మొత్తం 700 ఎకరాల భూసేకరణకు అనుమతి మంజూరు చేశారు.ఈ ప్రాజెక్ట్ ఉత్తర తెలంగాణ అభివృద్ధికి, వాణిజ్య, పారిశ్రామిక మరియు పర్యాటక రంగాలకు కొత్త దారులు తెరుస్తుందని విశ్లేషకులు పేర్కొన్నారు.విమానాశ్రయ అభివృద్ధి సాధ్యతపై ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) సమర్పించిన నివేదిక సానుకూలంగా వచ్చినందున, ప్రభుత్వం భూసేకరణ ప్రక్రియను తక్షణమే ప్రారంభించాలని జిల్లా కలెక్టర్‌కు ఆదేశించింది.
మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఈ సందర్భంగా తెలిపారు:“అదిలాబాద్ ఎయిర్‌పోర్ట్ అభివృద్ధి ఉత్తర తెలంగాణకు ఆర్థికంగా కొత్త ఊపిరిని అందించే ప్రాజెక్ట్. వాణిజ్యం, పరిశ్రమలు, పర్యాటకం, అత్యవసర సేవలకు ఇది కీలకంగా ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర రవాణా మౌలిక సదుపాయాల రూపకల్పనకు కట్టుబడి ఉంది.”ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ అభివృద్ధి కొత్త దిశలో సాగుతోందని, ఈ ప్రాజెక్ట్ భవిష్యత్తులో దేశ విమానయాన పటంలో ఆదిలాబాద్‌ను కీలక స్థానంలో నిలుపుతుందని మంత్రి పేర్కొన్నారు.అంతేకాదు, ఇది కేవలం విమానాశ్రయం మాత్రమే కాక, ఉత్తర తెలంగాణ ఆర్థిక వృద్ధికి నూతన ద్వారం అవుతుంది. ప్రభుత్వం ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ ప్రాజెక్ట్‌ను వేగంగా ముందుకు తీసుకెళ్లేందుకు కృతనిశ్చయంతో ఉందని కోమటిరెడ్డి తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa