TG: రంగారెడ్డి జిల్లాలోని కొత్తూరు మున్సిపాలిటీ శివారులో దారుణం చోటు చేసుకుంది. పెద్దమ్మ తండా రహదారికి ఆనుకుని ఉన్న ఓ రియల్ ఎస్టేట్ వెంచర్‌లో భవన నిర్మాణ కార్మికుడిని గుర్తుతెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. ప్రాథమిక సమాచారం ప్రకారం.. మృతుడు ఉత్తరాది రాష్ట్రానికి చెందిన వ్యక్తిగా తెలిసింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa