ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జూబ్లీహిల్స్‌లో పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది: జిల్లా ఎన్నికల అధికారి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Nov 11, 2025, 11:33 AM

TG: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ ప్రారంభం కాగా.. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఈ క్రమంలోనే పోలింగ్ కేంద్రాలను సందర్శించిన జిల్లా ఎన్నికల అధికారి ఆర్వీ కర్ణన్ మాట్లాడుతూ.. జూబ్లీహిల్స్ నియోజకవర్గ వ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోందని అన్నారు. గతంలో కంటే 40 పోలింగ్ కేంద్రాలను పెంచామని ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలో ఓ పోలింగ్ కేంద్రం వద్ద డ్రోన్ పనితీరును కర్ణన్‌ పరిశీలించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa