హైదరాబాద్ నగరంలోని మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో విదేశీయులు నిర్వహిస్తున్న ఓ వ్యభిచార ముఠాను పోలీసులు పట్టుకున్నారు. మాదాపూర్ ఎస్‌ఓటీ, మియాపూర్ పోలీసులు సంయుక్తంగా జరిపిన ఈ దాడుల్లో నిర్వాహకుడి సహా మొత్తం ఐదుగురు విదేశీయులను అరెస్ట్ చేశారు.మియాపూర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. న్యూ హఫీజ్‌పేట్‌లోని సుభాష్ చంద్రబోస్ నగర్ కాలనీలో ఉన్న ఓ ఇంట్లో రహస్యంగా వ్యభిచారం జరుగుతున్నట్లు పోలీసులకు పక్కా సమాచారం అందింది. దీంతో సోమవారం రాత్రి పోలీసులు ఆ ఇంటిపై దాడి చేసి తనిఖీలు చేపట్టగా, అక్కడ విదేశీ మహిళలతో వ్యభిచారం జరుగుతున్నట్లు నిర్ధారించారు.ఈ రాకెట్‌ను లైబేరియా దేశానికి చెందిన డేరియస్ (28) నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. ఇతడు 2021లో స్టూడెంట్ వీసాపై భారత్‌కు వచ్చి, స్థానికంగా ఓ కళాశాలలో ఆన్‌లైన్‌లో చదువుకుంటున్నాడు. కెన్యా, ఉగాండా దేశాలకు చెందిన మహిళలతో ఇతడు ఈ దందాను నడిపిస్తున్నట్లు విచారణలో తేలింది.నిందితుడు డేరియస్‌తో పాటు నలుగురు విదేశీ మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa