రెండు రోజులుగా పెరుగుతూ వచ్చిన బంగారం ధరకు ఈరోజు స్వల్పంగా బ్రేక్ పడింది.ఈనాటి మార్కెట్ వివరాల ప్రకారం, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.330 తగ్గి రూ.1,25,510 వద్ద స్థిరపడింది. అదేవిధంగా, 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.300 తగ్గి రూ.1,15,050గా నమోదైంది. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం వంటి ప్రధాన నగరాల్లో దాదాపు ఇవే ధరలు కొనసాగుతున్నాయి. గ్రాము బంగారం ధరలను పరిశీలిస్తే, 24 క్యారెట్లపై రూ.33 తగ్గి రూ.12,551 ఉండగా, 22 క్యారెట్లపై రూ.30 తగ్గి రూ.11,505 వద్ద ట్రేడ్ అవుతోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa