ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఢిల్లీ పేలుడు ఎఫెక్ట్,,,,హైదరాబాద్‌‌లో బాంబ్ స్క్వాడ్‌.. షాపింగ్‌మాల్స్, బస్టాప్స్, టెంపుల్స్‌లో గాలింపు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Nov 12, 2025, 07:24 PM

దేశంలో పెను సంచలనం సృష్టించిన ఢిల్లీ పేలుడు తర్వాత.. దేశవ్యాప్తంగా భద్రతా బలగాలు, పోలీసులు అలర్ట్ అయ్యారు. రద్దీగా ఉండే ప్రాంతాల్లో విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నారు. షాపింగ్‌మాల్స్, బస్టాండ్లు, దేవాలయాల్లో సోదాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే బుధవారం సాయంత్రం హైదరాబాద్‌లో బాంబ్ స్క్వాడ్ తనిఖీలు నిర్వహించారు. రద్దీగా ఉండే మాల్స్, బస్టాప్స్, టెంపుల్స్‌లో బాంబులు ఉన్నాయా అనేది తెలుసుకునేందుకు గాలింపు చేపట్టారు. దేశంలో ఎక్కడ ఉగ్రవాద దాడులు జరిగినా.. దానికి ఏదో ఒక చిన్న లింక్ హైదరాబాద్‌కు గతంలో ఉండటంతో.. తాజాగా ఢిల్లీలో జరిగిన పేలుడుతో పోలీసులు అలర్ట్ అయ్యారు.


ఇక హర్యానాలోని ఫరీదాబాద్‌లో భారీ మొత్తంలో పేలుడు పదార్థాలు పట్టుబడటం.. అదే రోజు ఢిల్లీలో పేలుడు సంభవించడంతో.. వీటికి సంబంధించి లింక్ ఉందని ఇప్పటికే నిఘా సంస్థలు అనుమానాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలోనే దేశంలోని అన్ని నగరాల్లో హైఅలర్ట్ విధించారు. ఉగ్రవాదులు ఈ పేలుడు పదార్థాలను ఉపయోగించి.. దేశవ్యాప్తంగా పేలుళ్లకు పాల్పడాలని ప్రయత్నాలు చేస్తున్నారనే ఊహాగానాల నేపథ్యంలో.. అన్ని నగరాల్లో తనిఖీలు చేపడుతున్నారు.


మరోవైపు.. ఢిల్లీ పేలుడుతో అప్రమత్తమైన హైదరాబాద్‌ పోలీసులు.. పాతబస్తీలోని అనుమానిత ప్రాంతాల్లో ఇప్పటికే ముమ్మరంగా తనిఖీలు చేపట్టిన విషయం తెలిసిందే. ప్రధానంగా హైదరాబాద్‌ పాతబస్తీలో కార్డన్ సెర్చ్ (నాకాబందీ)తో పాటు ఇతర రద్దీ ప్రాంతాల్లో తనిఖీలు ముమ్మరం చేశారు. ఈ సందర్భంగా ఢిల్లీలోని ఎర్రకోట వద్ద జరిగిన పేలుళ్ల దృష్ట్యా.. హైద‌రాబాద్ సీపీ వీసీ స‌జ్జనార్ నగరవాసులకు ఒక కీలక విజ్ఞప్తి చేశారు. ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు లేదా ఏవైనా అనుమానాస్పద వస్తువులు కనిపిస్తే 100 నంబర్‌కు ఫోన్ చేసి సమాచారం అందించాలని కోరారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa