ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పెళ్లి కావడంలేదని ఆవేదనతో యువకుడి ఆత్మహత్య

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Nov 13, 2025, 10:49 AM

TG: పెళ్లి కావడం లేదని ఆవేదనతో ఓ యువకుడు ప్రాణాలు తీసుకున్నాడు. హన్మకొండ జిల్లా ఆత్మకూరు మండల కేంద్రంలో నివాసం ఉంటున్న బూర సురేందర్, రమ దంపతులు పెద్ద కుమారుడు నరేష్(32)కు గత నాలుగేళ్లుగా పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. అమీర్‌పేట్ ప్రాంతంలో ఒక బట్టల షాపులో పని చేస్తున్నందుకు పిల్లను ఇవ్వడానికి ఎవరూ ముందుకు రావడం లేదని నరేష్ కొద్దిరోజులుగా ఆవేదన చెందుతున్నాడు. ఈ క్రమంలో ఘట్‌కేసర్ రైల్వే స్టేషన్ సమీపంలో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa