ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పెళ్లి కావడంలేదని మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్న యువకుడు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Nov 13, 2025, 01:51 PM

హైదరాబాద్‌లో ఓ యువకుడు తీవ్ర నిర్ణయం తీసుకున్నాడు. మూడు పదుల వయసు దాటినా పెళ్లి కావడం లేదన్న మనస్తాపంతో రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషాద ఘటన ఘట్‌కేసర్ రైల్వే స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.వివరాల్లోకి వెళితే.. హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలానికి చెందిన బూర సురేందర్, రమ దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. పెద్ద కుమారుడైన నరేశ్ (32) హైదరాబాద్‌లోని అమీర్‌పేటలో ఓ బట్టల దుకాణంలో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. కుమార్తెకు వివాహం కాగా, నరేశ్‌కు గత నాలుగేళ్లుగా కుటుంబసభ్యులు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు.అయితే, నరేశ్ ఓ బట్టల షాపులో పనిచేస్తున్నాడనే కారణంతో పిల్లను ఇచ్చేందుకు ఎవరూ ముందుకు రాలేదని కుటుంబసభ్యులు చెబుతున్నారు. ఎన్ని సంబంధాలు చూసినా కుదరకపోవడంతో నరేశ్ తీవ్ర మస్తాపానికి గురయ్యాడు.ఈ క్రమంలో జీవితంపై విరక్తి చెందిన నరేశ్, మంగళవారం మధ్యాహ్నం ఘట్‌కేసర్‌లోని మాధవరెడ్డి ఫ్లై ఓవర్ సమీపంలో గోల్కొండ ఎక్స్‌ప్రెస్ రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబసభ్యులు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa