నల్లగొండ జిల్లా నేరేడుగొమ్మ మండలం బుగ్గతండా వద్ద గురువారం కూలీలతో వెళ్తున్న ఆటో అదుపుతప్పి బోల్తా కొట్టింది. ఈ దుర్ఘటనలో పది మంది కూలీలు గాయపడ్డారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. పెద్ద అడిశర్లపల్లి మండలం పెద్ద గుమ్మడం గ్రామానికి చెందిన కూలీలు కచరాజ్‌పల్లి గ్రామంలో పత్తి ఏరేందుకు ఆటోలో వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. క్షతగాత్రులను చికిత్స కోసం దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa