ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గజ్వేల్‌లో డ్రంక్ అండ్ డ్రైవ్‌పై కఠిన చర్యలు.. 25 మందికి జరిమానా

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Nov 13, 2025, 02:50 PM

గజ్వేల్ పట్టణంలో ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ మురళి ఆధ్వర్యంలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. వివిధ మండలాల నుంచి వచ్చి మద్యం సేవించి వాహనాలు నడిపిన 25 మందిని బ్రీత్ ఎనలైజర్ ద్వారా గుర్తించారు. వీరిపై రూ. 10,000 జరిమానా విధించనున్నట్లు, ప్రమాదాలు జరిగితే కుటుంబాలకు తీరని నష్టం వాటిల్లుతుందని, మద్యం సేవించి వాహనాలు నడపవద్దని సూచించారు. రెండోసారి పట్టుబడితే రూ. 15,000 జరిమానా, ఆరు నెలల జైలు శిక్షతో పాటు డ్రైవింగ్ లైసెన్స్ ఆరు నెలల పాటు సస్పెండ్ చేస్తామని తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa