AP: బిడ్డను చూడకుండానే తండ్రి కన్నుమూసిన విషాద సంఘటన అనంతపురం జిల్లాలో చోటుచేసుకుంది. బుధవారం రాత్రి అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రిలో భార్య ఆడ శిశువుకు జన్మనిచ్చిన నేపథ్యంలో, ధర్మవరానికి చెందిన దిలీప్‌కుమార్ (25) తన బిడ్డను చూడటానికి ఆనందంగా బయల్దేరాడు. ధర్మవరం నుంచి బైక్‌పై బయలుదేరిన అతను, బత్తలపల్లి దాటగానే వైజంక్షన్ వద్ద బైక్ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొని బోల్తాపడటంతో అక్కడికక్కడే మృతిచెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa