హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారి పక్కన, చిట్యాల మండలం వెలిమినేడు గ్రామ శివారులో పోలీసులు వినూత్నంగా హోర్డింగ్ ఏర్పాటు చేశారు. 'నీ వాహనం వేగంగా వెళుతుంది. కానీ నీ జీవితం ఆగిపోతుంది' అని పెద్ద అక్షరాలతో రాసిన ఈ హోర్డింగ్‌కు, రోడ్డు ప్రమాదంలో తుక్కుగా మారిన కారును కూడా అమర్చారు. అతివేగంగా వెళ్లే వాహనదారులను హెచ్చరించేందుకు ఈ ఏర్పాటు చేసినట్లు నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్‌చంద్ర పవార్ గురువారం తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa