తెలంగాణ హార్టికల్చర్ వర్సిటీలో ప్రొఫెసర్ డాక్టర్ పిడిగం సైదయ్య ఆధ్వర్యంలో కాశ్మీర్ కుంకుమ పువ్వును ఏరోఫోనిక్ విధానంలో సాగు చేశారు. ఈ పద్ధతిలో నేల అవసరం లేకపోవడం, తక్కువ నీటితో సేంద్రీయంగా సాగు చేయడం వల్ల కూలీల అవసరం తగ్గి, మంచి దిగుబడి లభిస్తుంది. ఈ విజయంతో గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఊపు వస్తుందని నాబార్డ్ తెలంగాణ సీఎజీఎం బి. ఉదయ్ భాస్కర్ తెలిపారు. రాష్ట్రంలో మోడల్ ల్యాబ్‌లతో ఈ టెక్నాలజీని రైతులకు అందించనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa