HYD: కూకట్‌పల్లిలోని భాగ్యనగర్ కాలనీలో మద్యం దుకాణాన్ని వ్యతిరేకిస్తూ మహిళలు, కాలనీవాసులు రోడ్డెక్కి ధర్నా నిర్వహించారు. కేపీహెచ్‌బీ మెట్రో స్టేషన్ సమీపంలో ఉన్న ఈ షాపు వల్ల తీవ్ర ఇబ్బందులు, ట్రాఫిక్ సమస్యలు ఎదురవుతున్నాయని ఆందోళన చేపట్టారు. కోర్టు, పోలీసులను ఆశ్రయించినా ఫలితం లేదని, మందుబాబుల వేధింపులు తట్టుకోలేకపోతున్నామని వాపోయారు. మద్యం షాపును తొలగించేలా అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa