సంగారెడ్డి జిల్లా ఫసల్వాదిలోని గణపతి షుగర్ కర్మాగారంలో ఈ సీజన్‌కు గాను చెరుకు క్రషింగ్ కార్యకలాపాలను యాజమాన్యం ప్రారంభించింది. భారతీయ కిసాన్ సంఘ్ జిల్లా అధ్యక్షులు పి. నరసింహారెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొని, కర్మాగారం సజావుగా నడవాలని, కార్మికులు క్షేమంగా ఉండాలని, రైతులకు ఇబ్బందులు కలగకుండా యాజమాన్యం తగు జాగ్రత్తలు తీసుకోవాలని, టన్నుకు రూ. 4500 ప్రకటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి రామకృష్ణ రెడ్డి, నాయకులు నరసింహారెడ్డి, మాణిక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa