TG: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఇండిగో విమానాల అంతరాయం నాలుగో రోజూ కొనసాగుతోంది. హైదరాబాద్‌కు రావాల్సిన 26, ఇక్కడి నుంచి బయలుదేరాల్సిన 43 విమానాలు కలిపి మొత్తం 69 విమానాలు రద్దు అయ్యాయి. పరిస్థితులు పూర్తిగా సాదారణ స్థితికి రావడానికి 5 నుంచి 10 రోజులు పట్టవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. విమాన సేవల అంతరాయాన్ని కేంద్రం తీవ్రంగా పరిగణించి, మూడు రోజుల్లో పునరుద్ధరణ చర్యలు తీసుకుంటామని తెలిపింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa