ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రామగుండం థర్మల్ ప్లాంట్ మూసివేత: 800 మెగావాట్ల కొత్త ప్లాంట్ నిర్మాణం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Dec 08, 2025, 11:36 AM

52 ఏళ్లకు పైగా విద్యుత్ ఉత్పత్తి చేసిన రామగుండం 62.5 మెగావాట్ల థర్మల్ పవర్ ప్లాంట్‌ను రాష్ట్ర ప్రభుత్వం మూసివేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. 1971లో ప్రారంభమైన ఈ ప్లాంట్ 52 ఏళ్ల 7 నెలల పాటు 18,743.4 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేసింది. పరికరాల సామర్థ్యం తగ్గడంతో జూన్ 4, 2024న ఉత్పత్తిని నిలిపివేశారు. ఈ ప్లాంట్ స్థలంలోనే కొత్తగా 800 మెగావాట్ల థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై రాష్ట్ర జెన్‌కో సంస్థ ఈ సంవత్సరం జనవరిలో ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa