కొత్తూరు మండలంలోని ప్రభుత్వ కార్యాలయంలో పనిచేస్తున్న ఉద్యోగి నడిపిన కారు పెంజర్ల రోడ్డులో అదుపుతప్పి రోడ్డు పక్కకు దూసుకెళ్లింది. అదృష్టవశాత్తూ, ఎవరికీ గాయాలు కాలేదు. నిద్రమత్తు కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని ఉద్యోగి మంగళవారం తెలిపారు. కారు పూర్తిగా రోడ్డు పక్కకు వెళ్లినప్పటికీ, వెళ్తున్న ప్రయాణికులు వెంటనే స్పందించి సహాయం అందించారు. బోలోరో వాహన సహాయంతో కారును తిరిగి రోడ్డు పైకి తీశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa