ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జనవరి 13 నుంచి సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో 'కైట్ ఫెస్టివల్'

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Dec 22, 2025, 04:11 PM

TG: సంక్రాంతి సందర్భంగా జనవరి 13 నుంచి 15 వరకు సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో 7వ అంతర్జాతీయ గాలిపటం, స్వీట్ ఫెస్టివల్-2025 జరుగనుంది. ఈ మేరకు ఏర్పాట్లపై ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు అధికారులతో సమీక్ష నిర్వహించారు. జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ, హైడ్రా అధికారులు పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. పునరుద్ధరించిన చెరువుల వద్ద కూడా ఈ ఉత్సవాలను నిర్వహించాలని, ఏర్పాట్లలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూడాలని సూచించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa