హైదరాబాద్‌లో పిల్లలను అక్రమంగా అమ్ముతున్న ముఠాను సైబరాబాద్ ఎస్‌వోటీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ముఠా దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి పిల్లలను తరలించి అమ్ముతోంది. మొత్తం 12 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు, వారి నుంచి ఇద్దరు పసికందులను రక్షించారు. ఈ ముఠా 8 ఆస్పత్రులకు ఏజెంట్లుగా వ్యవహరిస్తూ, ఇప్పటివరకు 15 మంది పిల్లలను అమ్మినట్లు గుర్తించారు. హైదరాబాద్‌తో పాటు అహ్మదాబాద్ నుంచి కూడా పిల్లలను తెచ్చి అమ్మకాలు జరిపినట్లు, ఒక్కో శిశువు అమ్మకం వెనుక రూ.15 లక్షల లావాదేవీలు జరిగినట్లు పోలీసులు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa