కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజులరామారం సర్కిల్ ఆధ్వర్యంలో హెచ్ ఏ ఎల్ కాలనీలో శ్రీకృష్ణదేవరాయ కాపు సంక్షేమ సంఘం ఏర్పాటు చేసిన వంగవీటి మోహన్ రంగ వర్ధంతి కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ మోహన్ రంగా విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా శ్రీశైలం గౌడ్ మాట్లాడుతూ వంగవీటి మోహన్ రంగను సామాజిక ఉద్యమ వీరుడు, రాజకీయ దురంధరుడు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా అభివర్ణించి, ఆయన చేసిన సేవా కార్యక్రమాలను కొనియాడారు. అనంతరం ఉచిత వైద్య శిబిరం, అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa