ఆనంద్ నగర్‌లోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో మంగళవారం వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. ఉదయం స్వామివారికి అభిషేకం, ప్రత్యేక అలంకరణ, హారతి కార్యక్రమాలు భరత్ కుమార్ ఆచార్యులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు మరం గోపాల్ రెడ్డి, కార్యదర్శి ఎం. సూర్య నారాయణ, జనరల్ సెక్రటరీ వై. వాసుదేవం తదితరులు పాల్గొన్నారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి దర్శనం చేసుకొని ఆశీస్సులు పొందారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa