ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేటి నుంచే నుమాయిష్‌

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Jan 01, 2026, 11:43 AM

అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన (నుమాయిష్‌) గురువారం ప్రారంభం కానుంది. ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి దీనిని ప్రారంభిస్తారు. ఫిబ్రవరి 15 వరకు సుమారు 45 రోజుల పాటు కొనసాగే ఈ ప్రదర్శనకు ప్రవేశ రుసుము రూ. 50గా నిర్ణయించారు. ఐదేళ్లలోపు చిన్నారులకు ఉచిత ప్రవేశం కల్పించనున్నారు. ప్రతీరోజూ సాయంత్రం 4 నుంచి రాత్రి 10 గంటల వరకు, వారాంతాల్లో, సెలవు దినాల్లో రాత్రి 11 గంటల వరకు ప్రదర్శన కొనసాగుతుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa