ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పోలీస్ శాఖకు పథకాలు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Jan 01, 2026, 11:55 AM

నూతన సంవత్సర సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం పోలీస్, విజిలెన్స్, ఏసీబీ, ఫైర్ సర్వీసెస్ సిబ్బందికి పలు పథకాలను ప్రకటించింది. విశిష్ట సేవలకు గాను నగదు పురస్కారాలు, పింఛన్లు అందజేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. తెలంగాణ శౌర్య పథకం కింద నెలకు రూ.500 పింఛన్, రూ.10 వేల నగదు, మహోన్నత సేవా పథకం కింద రూ.40 వేల నగదు, ఉత్తమ సేవా పథకం కింద రూ.30 వేల నగదు, కటినా సేవా పథకం కింద రూ.20 వేల నగదు, తెలంగాణ సేవా పథకం కింద రూ.20 వేల నగదు పురస్కారం అందించనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa