తెలంగాణలో యూరియా కొరత లేదని ప్రభుత్వం చెబుతున్నా, క్షేత్రస్థాయిలో రైతుల అవస్థలు కొనసాగుతున్నాయి. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సచివాలయంలో యూరియా పంపిణీపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో ఎరువుల కొరత లేదని, ప్రస్తుతం 2 లక్షల టన్నుల యూరియా నిల్వలు ఉన్నాయని ప్రకటించారు. ఇప్పటికే 4 లక్షల టన్నులు రైతులకు అందజేశామని మంత్రి తెలిపారు. అయినప్పటికీ, గ్రామాల్లో రైతులు తెల్లవారుజామునే చలిలో క్యూలైన్లలో నిలబడాల్సిన పరిస్థితి నెలకొంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa