అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన (నుమాయిష్) గురువారం ప్రారంభం కానుంది. ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి దీనిని ప్రారంభిస్తారు. ఫిబ్రవరి 15 వరకు సుమారు 45 రోజుల పాటు కొనసాగే ఈ ప్రదర్శనకు ప్రవేశ రుసుము రూ. 50గా నిర్ణయించారు. ఐదేళ్లలోపు చిన్నారులకు ఉచిత ప్రవేశం కల్పించనున్నారు. ప్రతీరోజూ సాయంత్రం 4 నుంచి రాత్రి 10 గంటల వరకు, వారాంతాల్లో, సెలవు దినాల్లో రాత్రి 11 గంటల వరకు ప్రదర్శన కొనసాగుతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa