ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నర్సింగిలో డ్రగ్స్ పెడ్లర్ అరెస్ట్.. న్యూ ఇయర్ వేళ కోకైన్ కలకలం!

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Jan 01, 2026, 01:49 PM

హైదరాబాద్‌లో నూతన సంవత్సర వేడుకల్లో డ్రగ్స్ విక్రయిస్తున్న మహంకాళి శ్రీనివాస్ కళ్యాణ్ (46) అనే పెడ్లర్‌ను నర్సింగి పోలీసులు అరెస్ట్ చేశారు. గోల్డెన్ టెంపుల్ సమీపంలో నిందితుడిని పట్టుకుని, అతని వద్ద నుంచి 7 గ్రాముల కోకైన్, రెండు ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. పరీక్షల్లో అతను డ్రగ్స్ తీసుకున్నట్లు నిర్ధారణ అయింది. గోవాకు చెందిన ప్రధాన సరఫరాదారు విజయ్ పరారీలో ఉండగా, పోలీసులు అతని కోసం గాలిస్తున్నారు. వేడుకల వేళ పోలీసులు నిఘా పెంచడంతో ఈ ముఠా గుట్టురట్టయింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa