TG: నిజామాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు కల్వకుంట్ల కవిత నేతృత్వంలోని తెలంగాణ జాగృతి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. సుమారు 20 నుంచి 30 స్థానాల్లో తమ అభ్యర్థులను దింపేందుకు కవిత వ్యూహరచన చేస్తున్నారు. ఈ మేరకు హైదరాబాద్లోని ఆమె నివాసంలో ఆశావహులతో సమావేశమయ్యారు. నోటిఫికేషన్ రాకముందే అభ్యర్థుల ప్రకటన వెలువడనుంది. సొంత గడ్డపై సత్తా చాటాలని చూస్తున్న జాగృతి, ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ 'సింహం' గుర్తుపై పోటీ చేసే అవకాశం ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa