భారత్‌తో స్నేహ సంబంధాలు కోరుకునే దేశాలు ఉగ్రవాదంపై మెతక వైఖరిని విడనాడాలని భారత విదేశాంగ మంత్రి జైశంకర్ స్పష్టం చేశారు. పోలండ్ ఉప ప్రధాని, విదేశాంగ మంత్రి రాడోస్లావ్ సికోర్క్సీతో జరిగిన సమావేశంలో ఆయన ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. గత ఏడాది పాకిస్థాన్ పర్యటన సందర్భంగా రాడోస్లావ్ జమ్ము కశ్మీర్‌పై స్పందిస్తూ, కశ్మీర్ సమస్యను సామరస్యంగా పరిష్కరించాలని పాక్ నేతలతో కలిసి ఉమ్మడి ప్రకటన విడుదల చేశారు.ఈ నేపథ్యంలో జైశంకర్ స్పందిస్తూ, ఉగ్రవాదాన్ని భారత్ ఎప్పటికీ వ్యతిరేకిస్తూనే ఉంటుందని, కాబట్టి తమ దేశంతో స్నేహం కోరుకునే వారు ఉగ్రవాదంపై మెతక వైఖరిని ప్రదర్శించవద్దని కోరారు. ఉగ్రవాదులు ఎప్పటికైనా ప్రపంచ దేశాలకు ముప్పుగా మారే అవకాశం ఉందని హెచ్చరించారు. సరిహద్దు ఉగ్రవాదం వల్ల భారత్ ఎదుర్కొంటున్న సమస్యల గురించి రాడోస్లావ్‌కు తెలుసని అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa