ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భారీగా పెరిగిన బంగారం ధరలు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Jan 21, 2026, 01:23 PM

దేశీయ మార్కెట్లో బంగారం ధర సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. బుధవారం మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో పసిడి ఫ్యూచర్స్ ధర మునుపెన్నడూ లేనంత గరిష్ఠ స్థాయికి చేరింది. అమెరికా-యూరప్ మధ్య వాణిజ్య యుద్ధం ముదురుతుందన్న భయాలు, డాలర్ బలహీనపడటంతో పెట్టుబడిదారులు సురక్షిత పెట్టుబడిగా భావించే బంగారం కొనుగోళ్లకు మొగ్గుచూపారు. దీంతో ఎంసీఎక్స్‌లో ఫిబ్రవరి గోల్డ్ ఫ్యూచర్స్ ధర ఏకంగా 4.25శాతం (సుమారు రూ. 4,100) పెరిగి 10 గ్రాములకు రూ.1,56,970 వద్ద సరికొత్త ఆల్ టైమ్ రికార్డును నమోదు చేసింది.బంగారం బాటలోనే వెండి కూడా పయనించింది. ఎంసీఎక్స్ మార్చి సిల్వర్ ఫ్యూచర్స్ ధర 2.71శాతం పెరిగి కిలోకు రూ. 3,32,451కి చేరింది. అంతర్జాతీయ మార్కెట్లలోనూ ఇదే ధోరణి కనిపించింది. కామెక్స్‌లో ఔన్స్ బంగారం ధర 4,849 డాలర్లకు చేరింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa