ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సేంద్రియ వ్యవసాయ అవగాహన సదస్సులో పాల్గొన్న కె. నారాయణ

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Jan 21, 2026, 01:27 PM

నేలకొండపల్లిలోని సిద్ధార్థ యోగ విద్యాలయంలో సేంద్రియ వ్యవసాయంపై రైతులకు నిర్వహించిన అవగాహన సదస్సుకు సీపీఐ జాతీయ కార్యదర్శి కె. నారాయణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రసాయన ఎరువులు, పురుగుల మందుల అధిక వినియోగంతో నేల విషతుల్యమవుతోందని, దీని ప్రభావం ప్రజల ఆరోగ్యంపై పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. గతంలాగే ప్రతి రైతు సేంద్రియ సాగు వైపు మళ్లాలని ఆయన పిలుపునిచ్చారు.దేశంలో అత్యంత సారవంతమైన భూములు ఉన్నప్పటికీ యువత ఉపాధి కోసం విదేశాలకు వెళ్లాల్సి వస్తోందని నారాయణ అన్నారు. విత్తనాలు, ఎరువుల కంపెనీలు కార్పొరేట్‌ల చేతుల్లో ఉండటంతో లాభాలు బడా కంపెనీలకే చేరుతున్నాయని విమర్శించారు. చివరి ఊపిరి వరకు కమ్యూనిస్టు పార్టీలోనే పనిచేస్తానని స్పష్టం చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa