ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తల్లితో సహజీవనం చేస్తున్న వ్యక్తిని హతమార్చబోయిన కొడుకు, ప్రమాదవశాత్తు తల్లి మరణం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Jan 21, 2026, 01:56 PM

హైదరాబాద్ జవహర్‌నగర్ పరిధిలోని బాలాజీ నగర్‌కు చెందిన పొట్టోళ్ల రజని (40), జమీల్ అనే వ్యక్తితో సహజీవనం చేస్తోంది. దీనిని ఆమె కుమారుడు రాజ్ కరణ్ తీవ్రంగా వ్యతిరేకించేవాడు. జమీల్‌ను ఎలాగైనా వదిలించుకోవాలని భావించిన రాజ్ కరణ్, తన స్నేహితులతో కలిసి మద్యం పార్టీ ఏర్పాటు చేసి గొడవకు దిగాడు. కోపంతో జమీల్‌పై కత్తి విసరగా, అది అడ్డువచ్చిన తల్లి రజని కంట్లోకి బలంగా దూసుకుపోయింది. తీవ్ర గాయాలపాలైన ఆమె గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ కేసులో పోలీసులు రాజ్ కరణ్‌తో పాటు అతని స్నేహితుడిని రిమాండ్‌కు తరలించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa