ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఒప్పో నుండి 'ఒప్పో A6 5G' స్మార్ట్‌ఫోన్ విడుదల

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Jan 21, 2026, 02:06 PM

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ ఒప్పో.. భారత మార్కెట్లో తన A సిరీస్ పోర్ట్‌ఫోలియోను విస్తరించింది. తాజాగా 'ఒప్పో A6 5G' పేరుతో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. 7,000mAh భారీ బ్యాటరీ, శక్తిమంతమైన మీడియాటెక్ డైమెన్సిటీ 6000 ప్రాసెసర్, ఆకట్టుకునే కెమెరా ఫీచర్లతో ఈ ఫోన్ మిడ్-రేంజ్ విభాగంలో గట్టి పోటీనిచ్చేందుకు సిద్ధమైంది.భారత మార్కెట్లో ఒప్పో A6 5G మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంది.


4GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.17,999


6GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.19,999


6GB RAM + 256GB టాప్-ఎండ్ వేరియంట్ ధర రూ.21,999


ఈ స్మార్ట్‌ఫోన్ ఒప్పో ఇండియా ఆన్‌లైన్ స్టోర్‌లో ఇప్పటికే అమ్మకానికి అందుబాటులో ఉంది. కొనుగోలుదారులకు మరింత సౌలభ్యంగా ఎంపిక చేసిన డెబిట్, క్రెడిట్ కార్డులపై రూ.1,000 తక్షణ క్యాష్‌బ్యాక్, మూడు నెలల నో-కాస్ట్ ఈఎంఐ సౌకర్యం కూడా కల్పిస్తున్నారు. సఫైర్ బ్లూ, ఐస్ వైట్, సాకురా పింక్ అనే మూడు ఆకర్షణీయమైన రంగుల్లో ఇది లభిస్తుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa