ట్రెండింగ్
Epaper    English    தமிழ்

డెబ్బై ఏళ్ల వయసులో యూజర్లను ఆకట్టుకున్న పెద్దాయన

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Jan 22, 2026, 12:01 PM

డెబ్బై ఏళ్ల వయసులో ఇన్ స్టాలోకి ఎంట్రీ ఇచ్చిన ఓ పెద్దాయన.. తన తొలి వ్లాగ్ తోనే యూజర్లను ఆకట్టుకున్నారు. వ్లాగ్ అప్ లోడ్ చేసిన రెండు రోజుల్లోనే ఏకంగా 2.2 కోట్ల మందికి పైగా ఆయన వీడియో చూశారు. ఇంతకీ ఈ పెద్దాయన తన తొలి వ్లాగులో ఏం చూపించారంటే.. తన గురించిన పరిచయ వ్యాక్యాలు చెప్పారంతే. తనకు వ్లాగ్ లు చేయడం రాదంటూ ఆయన చెప్పిన మాటలు యూజర్లను విశేషంగా ఆకట్టుకున్నాయి.ఇన్ స్టా అంకుల్ పేరుతో తెరిచిన ఈ పేజీలో పెద్దాయన తొలి వ్లాగ్ పోస్ట్ చేస్తూ తనను తాను పరిచయం చేసుకున్నారు. ‘నా పేరు వినోద్ కుమార్ శర్మ. నా వయసు 70 సంవత్సరాలు. ఉత్తరప్రదేశ్ వాసిని. నాకు వ్లాగులు చేయడం రాదు. అయినా సరే ప్రయత్నిస్తున్నా. ఉద్యోగ విరమణ తర్వాత సమయాన్ని అర్థవంతంగా గడిపేందుకు ఈ ప్రయత్నం చేస్తున్నా. నా ఈ తొలి వీడియో మీకు నచ్చుతుందని ఆశిస్తున్నా. తద్వారా మరిన్ని వీడియోలు చేసేందుకు నాకు ప్రోత్సాహం లభిస్తుంది’ అని చెప్పుకొచ్చారు.శర్మ తొలి వ్లాగ్ ఇన్ స్టాలో వైరల్ గా మారింది. కేవలం రెండు రోజుల వ్యవధిలోనే 2.2 కోట్లకు పైగా వ్యూస్ వచ్చాయి. శర్మ మాటలకు నెటిజన్లు కామెంట్ల రూపంలో స్పందిస్తూ.. వయసనేది కేవలం ఓ నెంబర్ మాత్రమేనని శర్మను ప్రోత్సహిస్తున్నారు. అంకుల్ జీ.. మీరు మా మనసులు సంతోషంతో నిండిపోయేలా చేశారని మరికొందరు కామెంట్ చేశారు. శర్మను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఆయన పేజీని ఫాలో అవుతున్నారు. ఈ ఒక్క వ్లాగ్ తోనే ఆయన ఫాలోవర్ల సంఖ్య 64 వేలకు చేరింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa