రియల్‌మీ ఆడియో మార్కెట్లో ఓ కొత్త ట్రెండ్‌కు శ్రీకారం చుట్టబోతోంది. చెవి లోపల కాకుండా, చెవి బయట క్లిప్ మాదిరిగా తగిలించుకునే 'రియల్‌మీ బడ్స్ క్లిప్'ను త్వరలో లాంచ్ చేయనుంది. గంటల తరబడి ఇయర్‌బడ్స్ వాడటం వల్ల కలిగే అసౌకర్యాన్ని తగ్గించి, చెవి ఆరోగ్యానికి ప్రాధాన్యతనిస్తూ ఈ కొత్త డిజైన్‌ను రూపొందించారు.ప్రస్తుతం పని, వినోదం, వ్యాయామం ఇలా అన్ని అవసరాలకు ఇయర్‌బడ్స్ వాడకం పెరిగింది. ఎక్కువ సేపు చెవిలోపల బడ్స్ ఉంచుకోవడం వల్ల గాలి ప్రసరణ లేకపోవడం, ఒత్తిడి వంటి సమస్యలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో చెవికి సౌకర్యంగా ఉండే ఓపెన్-ఇయర్ ఆడియో డివైజ్‌లపై ఆసక్తి పెరుగుతోంది. ఈ తరహా బడ్స్ చెవి కాలువను మూసివేయకుండా, బయటి వైపు అమరి ఉంటాయి. దీనివల్ల చుట్టూ ఉన్న పరిసరాలపై అవగాహన ఉంటుంది. అలాగే గాలి ప్రసరణకు ఆటంకం ఉండదు.రియల్‌మీ బడ్స్ క్లిప్ సరిగ్గా ఇదే తరహా అనుభవాన్ని అందిస్తుంది. చెవి ఆకృతికి అనుగుణంగా వంగి ఉండేలా వీటిని డిజైన్ చేశారు. కేవలం 5.3 గ్రాముల బరువుతో చాలా తేలికగా ఉంటాయి. టైటానియం ఆధారిత మెమరీ మెటల్‌తో తయారు చేయడం వల్ల ఎలాంటి చెవికైనా సులభంగా సరిపోతాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa