ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కలకలం రేపుతున్న పెద్దపులి అడుగులు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Jan 29, 2026, 10:39 AM

యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలంలో గత పది రోజులుగా ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్న పెద్దపులి బుధవారం అర్ధరాత్రి తిరుమలాపూర్ గ్రామం మీదుగా వెళ్లింది. గురువారం ఉదయం గ్రామస్తులు పులి అడుగులను గుర్తించి అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. కవ్వాల్ రిజర్వ్ ఫారెస్ట్ అధికారులు పులి అడుగులను పరిశీలించి అవి పెద్దపులివేనని నిర్ధారించారు. దీంతో అధికారులు తిరుమలాపూర్ అటవీ ప్రాంతంలో కూంబింగ్ ఆపరేషన్ ప్రారంభించారు. పులి తిరుమలాపూర్ అడవి నుంచి శ్రీనివాసపురం అడవి వైపు వెళ్లిందని అధికారులు భావిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa