ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రశాంతంగా ముగిసిన మేడారం జాతర

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sun, Feb 01, 2026, 03:17 PM

మేడారం మహా జాతర ప్రశాంతంగా ముగిసింది. నాలుగు రోజుల పాటు కొనసాగిన ఈ మహా జాతరకు రెండు కోట్ల మందికి పైగా భక్తులు తరలివచ్చారు. తెలంగాణ రాష్ట్రం నుంచే కాకుండా దేశం నలుమూలల నుంచి వచ్చిన భక్తులు వన దేవతలు సమ్మక్క-సారలమ్మలను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. సమ్మక్క తల్లిని భక్తుల జయజయధ్వానాల మధ్య పూజారులు నిన్న సాయంత్రం వన ప్రవేశం చేయించారు. మిగతా గద్దెలపై కొలువై పూజలందుకున్న సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులను సైతం ఆయా పూజారులు తమ ప్రాంతంలోని గుళ్లకు తీసుకువెళ్లారు. దీంతో మహాజాతర ముగిసింది. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa