ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇంద్రేశం మున్సిపాలిటీలో మాద్రి పృథ్వీరాజ్ ఇంటింటి ప్రచారం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Feb 05, 2026, 08:07 PM

మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పటాన్‌చెరు నియోజకవర్గ పరిధిలోని ఇంద్రేశం మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు గూడెం మధుసూదన్ రెడ్డి గారితో కలిసి మాద్రి పృథ్వీరాజ్ గారు విస్తృతంగా ఇంటింటి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు ప్రతి ఇంటిని సందర్శిస్తూ ప్రజలతో నేరుగా మమేకమై వారి సమస్యలను శ్రద్ధగా విన్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం చూపేందుకు బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా కట్టుబడి ఉందని పృథ్వీరాజ్ గారు భరోసా కల్పించారు.అభివృద్ధి, ప్రగతి నిరంతరంగా కొనసాగాలంటే ఈ మున్సిపల్ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి బీఆర్ఎస్ పార్టీని ఘన విజయం సాధింపజేయాలని పృథ్వీరాజ్ గారు ప్రజలను కోరారు.గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ప్రజల సంక్షేమమే లక్ష్యంగా వ్యవసాయం, సాగునీరు, తాగునీరు, విద్యుత్, విద్య, సంక్షేమ పథకాలు మరియు మౌలిక వసతుల రంగాల్లో గణనీయమైన అభివృద్ధి సాధ్యమైందని వారు ఈ సందర్భంగా పేర్కొన్నారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa