పటాన్చెరు : పటాన్చెరు నియోజకవర్గంలో నూతన దేవాలయాల నిర్మాణాలకు.. పురాతన దేవాలయాల జీర్ణోదారణ పనులకు సంపూర్ణ సహకారం అందిస్తూ.. ప్రతి ఒక్కరిలో దైవభక్తి పెంపొందిస్తున్నామని పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. పటాన్చెరు డివిజన్ పరిధిలోని చైతన్య నగర్ కాలనీలో గల శ్రీ మహాదేవ గణపతి పంచయతన రాజరాజేశ్వరి దేవి, నవగ్రహ సమేత శ్రీ అభయ ఆంజనేయ స్వామి దేవాలయం పదవ వార్షికోత్సవం కార్యక్రమానికి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి దంపతులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అన్నదాన ప్రసాద వితరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. మహాశివుని ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa